Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేడు యేసు లేచినాడునేడు యేసు లేచినాడుమనమానందము Telugu Christian Song Lyrics

నేడు యేసు లేచినాడునేడు యేసు లేచినాడుమనమానందము Lyrics


నేడు యేసు లేచినాడు
నేడు యేసు లేచినాడు
మనమానందము నొందుదాము (2) ||నేడు||
పరలోకము నుండి దూతలు
దిగి వచ్చిరి సమాధికి (2)
భద్రముగా చేసిరిగా
బహు భద్రముగా చేసిరిగా ||నేడు||
మగ్దలేనే మరియ వేరొక మరియ
సుగంధ తైలము తెచ్చుకొని (2)
పూయుటకు వెళ్లిరిగా
బహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు||
వేకువ జామున యేసు ప్రభుండు
తోటలో సంచరింపంగ (2)
తోటమాలి అనుకొనెను
బహు తోటమాలి అనుకొనెను ||నేడు||
నేను ఇంకను తండ్రి యొద్దకు
త్వరగా వెళ్లిపోలేదు (2)
కనుక నన్ను ముట్టవద్దు
మరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు||

Your favourites

  • No Favourites found!