Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా Telugu Christian Song Lyrics

నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా Lyrics

నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2)
తడిసెదను.. నీ జీవనదిలో (2)
తడిసి తడిసి ఆనందించెదా (2)      ||నీ ఆనంద||

వీడిపోయెను నా పాప సంకెళ్లు
నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2)
దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2)
నే మరువగలనా నీ మంచి ప్రేమ (2)      ||నీ ఆనంద||

నీ ఆత్మ నాకు తోడుండగా
కానెన్నడు కాను ఒంటరిని (2)
ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2)
నే మరువగలనా నా హృదయములో (2)      ||నీ ఆనంద||

నే దాటిపోదును దేశ సరిహద్దులు
ప్రకాశించెద చీకటి లోకంలో (2)
జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2)
నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2)      ||నీ ఆనంద||

Your favourites

  • No Favourites found!