Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ చల్లని నీడలో నీ చక్కని Telugu Christian Song Lyrics

నీ చల్లని నీడలో నీ చక్కని Lyrics

నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో (2)
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2)         ||నీ చల్లని||

కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా (2)
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2)         ||నీ చల్లని||

ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి (2)
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2)         ||నీ చల్లని||

Your favourites

  • No Favourites found!