Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము Telugu Christian Song Lyrics

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము Lyrics

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)
(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)
తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2)
మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2)    ||నీ దీర్ఘ||

Your favourites

  • No Favourites found!