Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ ధనము నీ ఘనము ప్రభు Telugu Christian Song Lyrics

నీ ధనము నీ ఘనము ప్రభు Lyrics

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమ భాగము నీయ వెనుదీతువా ||నీ ధనము||
ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాథుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము||
పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయనో క్రైస్తవా ||నీ ధనము||
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధరపైని ప్రభు నామము
కలిమికొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము||
కలిగించె సకలంబు సమృద్ధిగా
తొలగించె పలు బాధభరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||

Your favourites

  • No Favourites found!