Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద Telugu Christian Song Lyrics

నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద Lyrics

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి (2)
నీ శిరము వానకు తడిచినను (2)
నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి (2)
ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)     ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||

Your favourites

  • No Favourites found!