Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ జీవితం క్షణ భంగురంగమ్యంబులేని వేదనల Telugu Christian Song Lyrics

నీ జీవితం క్షణ భంగురంగమ్యంబులేని వేదనల Lyrics

నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం||
ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||

Your favourites

  • No Favourites found!