నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు
2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా Lyrics
Your favourites
- No Favourites found!
