నీ కృప లేనిదే నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య (2)
నేనేమైయున్నానో నాకెమున్నాను
కేవలం నీ కృప (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2)
// నీ కృప లేనిదే //
1. నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప (2)
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్ (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2)
// నీ కృప లేనిదే //
2. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే
ఆదరించినది నీ కృప (2)
మాటరని నాకు రాగమునిచ్చి
నీ కృపాను చాటె దన్యతనిచ్చావు (2)
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2)
// నీ కృప లేనిదే //
