1. నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు
నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక
2. దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక
ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై
3. స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
4. యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు
ఏలెదవు భూమిమీద - నున్న జనులను
5. జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక
జనులు దేవా నిన్ను - స్తుతియించెదదు గాక
6. భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును
భూలోకులందరు దైవ - భక్తి కల్గి యుందురు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ మార్గము దేవా భూమి మీద Lyrics
Your favourites
- No Favourites found!
