Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి Telugu Christian Song Lyrics

నీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి Lyrics

నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి
మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ - 2
1. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - 2
స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - 2
కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - 2
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె - 2
2. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము
అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది
అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం
శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు
అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన
క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను
మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి
కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను
యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె


Your favourites

  • No Favourites found!