Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ నామమే ఎద కొలిచెదను నీ Telugu Christian Song Lyrics

నీ నామమే ఎద కొలిచెదను నీ Lyrics

నీ నామమే ఎద కొలిచెదను
నీ వాక్యమునే సదా తలచెదను (2)
సైన్యములకధిపతియగు దేవా
ఆది దేవుడవయిన యెహోవా (2)      ||నీ నామమే||

దోష రహితుడ – సృష్టి కారుడ
నేరమెంచని నిర్ణయకుడా
సిలువ దరుడ – మరణ విజయుడ
లోక రక్షక యేసు నాథుడా (2)      ||సైన్యము||

నిన్ను మరచిన – మిగులు శూన్యము
నీతో అణకువ పెంచు జ్ఞానము
నాదు లోకము – బహు కలవరము
నీదు వాక్యము తెలుపు మార్గము (2)      ||సైన్యము||

క్షణము వీడని – నీడ నీవని
నమ్మి నిరతము నిన్ను వేడెద
నీదు పాత్రగ – యాత్ర సాగెద
నీదు ఘనతను ఎలిగి చాటెద (2)      ||సైన్యము||

Your favourites

  • No Favourites found!