Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ Telugu Christian Song Lyrics

నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ Lyrics


నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు (2)       ||నీ నిర్ణయం||

లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2)       ||నీ నిర్ణయం||

పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2)       ||నీ నిర్ణయం||

Your favourites

  • No Favourites found!