Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే Telugu Christian Song Lyrics

ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే Lyrics

ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2)         ||ప్రార్థన||

ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2)         ||ప్రభువా||

ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2)         ||ప్రభువా||

Your favourites

  • No Favourites found!