Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ పాదాలే నాకు శరణంయేసయ్యా నీవే Telugu Christian Song Lyrics

నీ పాదాలే నాకు శరణంయేసయ్యా నీవే Lyrics

నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము (2)
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే||
అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము (2)
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు (2)
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||

Your favourites

  • No Favourites found!