Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై Telugu Christian Song Lyrics

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై Lyrics

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)
నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)

నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను (2)       ||యేసయ్యా||

జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను (2)       ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!