Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ ప్రియ ప్రభుని సేవకై – Telugu Christian Song Lyrics

నీ ప్రియ ప్రభుని సేవకై – Lyrics

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2)
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2)       ||నీ ప్రియ||

తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2)         ||నీ ప్రియ||

ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2)
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2)
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2)          ||నీ ప్రియ||

యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2)
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2)
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2)          ||నీ ప్రియ||

Your favourites

  • No Favourites found!