నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే
1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే
సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే
2. తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి
తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము
4. యెవరతని నేవించెదరో - ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో Lyrics
Your favourites
- No Favourites found!
