Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ రక్త ధారలే – మా జీవనాధారాము Telugu Christian Song Lyrics

నీ రక్త ధారలే – మా జీవనాధారాము Lyrics

నీ రక్త ధారలే – మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)

మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే        ||ఓ సిల్వ||

మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే       ||ఓ సిల్వ||

నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై        ||ఓ సిల్వ||

Your favourites

  • No Favourites found!