Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ సాక్ష్యము ఏదినీ బలియర్పణ ఏది Telugu Christian Song Lyrics

నీ సాక్ష్యము ఏదినీ బలియర్పణ ఏది Lyrics

నీ సాక్ష్యము ఏది
నీ బలియర్పణ ఏది (2)
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
మేల్కో లెమ్ము (2)
రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||
అపోస్తుల కాలమందు
ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2)
ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము||
కొరడాతో కొట్టబడిరి
చెరసాలయందుంచబడిరి (2)
చెరసాల సంకెళ్లును (2)
వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము||
కోత విస్తారమెంతో
కోత కోయువారు కొందరే (2)
యేసు నిన్ పిలచుచుండే (2)
త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||

Your favourites

  • No Favourites found!