Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ సల్లని సూపే ఓ యేసయ్యానా Telugu Christian Song Lyrics

నీ సల్లని సూపే ఓ యేసయ్యానా Lyrics

నీ సల్లని సూపే ఓ యేసయ్యా
నా బతుకును మార్చింది మెస్సీయా
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా
నను సేదదీర్చింది మెస్సీయా
1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా - తగ్గింపు నేర్పింది మెస్సీయా
పరిశుద్ధ నీ నడత యేసయ్యా - మాదిరి నాకుంచింది మెస్సీయా
2. నీవు కార్చిన రక్తం యేసయ్యా - నా పాపం కడిగింది మెస్సీయా
నీవు పొందిన మరణం యేసయ్యా - నాకు జీవం పోసింది మెస్సీయా
3. నీ దేహపు గాయం యేసయ్యా - స్వస్థత కలిగించింది మెస్సీయా
నీ కలువరియాగం యేసయ్యా - కొత్తజన్మనిచ్చింది మెస్సీయా

Your favourites

  • No Favourites found!