Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ స్వరము వినిపించు ప్రభువా నీ Telugu Christian Song Lyrics

నీ స్వరము వినిపించు ప్రభువా నీ Lyrics

నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో           ||నీ స్వరము||

ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి – (2)         ||నీ స్వరము||

నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో – నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ – (2)         ||నీ స్వరము||

భయ భీతులలో – తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను – (2)         ||నీ స్వరము||

నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో – సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా – (2)         ||నీ స్వరము||

నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు – (2)         ||నీ స్వరము||

నా హృదయములోని – చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు – మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా – (2)         ||నీ స్వరము||

Your favourites

  • No Favourites found!