Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ వాక్యమే నన్ను బ్రతికించెను భాధలలో Telugu Christian Song Lyrics

నీ వాక్యమే నన్ను బ్రతికించెను భాధలలో Lyrics


నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా

1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)

2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2)

3. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది (2)

Your favourites

  • No Favourites found!