Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించెనిక్కముగ Telugu Christian Song Lyrics

నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించెనిక్కముగ Lyrics

1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె
నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే
2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను
అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను
3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను
4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు
తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే
5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా
వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను


Your favourites

  • No Favourites found!