Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు Telugu Christian Song Lyrics

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు Lyrics

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను
1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మనుజావళికి
నిబంధనను స్థిరముగ జేసి
నిరతము నలరారెడు మా ప్రభువా
2. వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి
3. నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ
4. ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
5. మన ఆత్మనుజీవము దేహమును
మన ప్రభుయేసు రాకడవరకు
వొసరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ
6. తండ్రికుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో


Your favourites

  • No Favourites found!