నీకేగా నా స్తుతి మాలిక – నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుదిరుగలేదు
మనలేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్యా ||నీకే||
1. సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) ||నీకే||
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా (2)
నా మది లోన మహారాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా
నీ నామం కీర్తించి అరాధింతును .. (2) ||నీకే||
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణప్రియుడా నన్నేలు దైవమా
ఆపాదమస్తకం నీకే అంకితం (2)
నా శ్వాస నిశ్యాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవెనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును (2) ||నీకే||
