Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా Telugu Christian Song Lyrics

నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా Lyrics


నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2)
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా

నా మార్గమంతటిలో నను కాపాడినావు (2)
నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2)           ||దేవా||

మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2)
ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2)
ఏమేమి మారినా నీ మాట మారదు (2)
అదియే నాకు బలమైన దుర్గము (2)           ||దేవా||

Your favourites

  • No Favourites found!