Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడచెదవేమో Telugu Christian Song Lyrics

నీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడచెదవేమో Lyrics

నీకు కలిగిన దానిని - చేపట్టుము
జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)
1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము
పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము
2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము
వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము
3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము
ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము
4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము
యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము
5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము
ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు
6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును
మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము


Your favourites

  • No Favourites found!