Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము Telugu Christian Song Lyrics

నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము Lyrics


నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||

Your favourites

  • No Favourites found!