ప. నీలాంటి దైవం ఎవరు
విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందన.. ఆ..
యేసునాథ నీకే వందన.. ఆ..
పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
త్రియేక దేవా వందన.. ఆ..
1. నీతి గల దైవం నీవే
కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా.. ఆ..
రక్షణాధారం నీవేగా.. (2)
||నీతి గల దైవం నీవే||
నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సద్గతియే.. (2)
||నీలాంటి దైవం ఎవరు||
2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం
మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తిదాత దైవం నీవేగా.. ఆ..
నీదు ఆత్మ వరములు కోరెదా.. (2)
||సర్వోన్నతుడా నీకే స్తోత్రం||
వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలో కాయుమయ్య
బ్రతుకు దినం (2)
నీలాంటి దైవం ఎవరు
విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందన.. ఆ..
నీదు బిడ్డగానే సాగేద.. ఆ..
యేసునాథ నీకే వందన.. ఆ..
జీవితాంతం నీకై బ్రతికెద.. ఆ..
పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
నిత్యము నే నీతో నడిచెద.. ఆ..
త్రియేక దేవా వందన.. ఆ..
ఘనపరతు నిన్నే నిరతము.. ఆ.
