Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీలి ఆకాశంలో నీ నీతి రాజ్యంలోనేనుండ Telugu Christian Song Lyrics

నీలి ఆకాశంలో నీ నీతి రాజ్యంలోనేనుండ Lyrics


నీలి ఆకాశంలో (2)
నీ నీతి రాజ్యంలో
నేనుండ గోరితి ప్రభువా ఆ…
నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో||
నా ప్రియుడు నా చెంతనున్నాడు
గోప రసమంత సువాసన కలవాడు
నా ప్రియుడు ఏదేను వనమాలి
కర్పూరాల పుష్పాల సమానుడు
అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా
అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా
ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో||
నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా
నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను
నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా
ఆ రత్నాల వర్ణుడు నను తాకగా
నేను నిదురించిన మనసు మేలుకొన్నది
నా మనసంతా యేసుతో నిండగా
రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||

Your favourites

  • No Favourites found!