నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను
దుమ్ములా ధూళిలా ప్రాణం పోవునంతలా
తనువులోను మనసులోనూ
శత్రు మిత్రుల చేతుల్లోను
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥నీళ్ళలా॥
1॰
పోయిందని అనుకున్న ప్రాణం తిరిగి దక్కేలా
దక్కిన ప్రాణం క్రొత్త బతుకును ప్రారంభించేలా
దేవునికి మానవునికి ఉపకరించేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥నీళ్ళలా॥
2॰
లోకులు చూపె ప్రేమలోని స్వార్ధం ఎరిగేలా
క్రీస్తులోని నిస్వార్ధ ప్రేమకు అర్ధం తెలిసేలా
అదృశ్యమైనవి నిత్యములంటు గ్రహింపు పొందేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥ నీళ్ళలా॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయానుదుమ్ములా ధూళిలా Lyrics
Your favourites
- No Favourites found!
