Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని (2) Telugu Christian Song Lyrics

నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని (2) Lyrics

నీలో జీవించాలని
నీలోనే బ్రతకాలని (2)
యుగయుగాల నీతోనే ఉండాలని (2)
తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2)
యేసూ నువ్వే కావాలి
నా యేసూ నీతో ఉండాలి (2)            ||నీలో||

మిగిలింది నాకు నిత్య శోకము
ఈ నా జీవిత యాత్రలో
కన్నీళ్లే నాకు అన్న పానములై
భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2)
నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2)
నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2)             ||యేసూ||

కటిక చీకటే నాకు స్నేహమాయెను
అంధకారమే నాలో నాట్యమాడెను
ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు
మార్గమే తెలియక మతి చెలించెను (2)
నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2)
నీ నామమే నాకు మార్గమాయెను (2)             ||యేసూ||

Your favourites

  • No Favourites found!