Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా Telugu Christian Song Lyrics

నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా Lyrics

నీలో సమస్తము సాధ్యమే (2)
మహొన్నతుడా యేసయ్యా
బలవంతుడా యేసయ్యా (2)
ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4)        ||నీలో||

అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2)
ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు
అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2)         ||మహొన్నతుడా||

శోధన వేదనలలో జయమిచ్చువాడవు
బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2)
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2)         ||మహొన్నతుడా||

Your favourites

  • No Favourites found!