నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో ||నీతి||
1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు నా తోడై –
కాపాడుచున్నావు నీవు (2)
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును
దయచేయువాడవు (2) ||నీతి||
2. పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో –
నన్నభిషేకించి యున్నావు నీవు (2)
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును
కలిగించువాడవు (2) ||నీతి||
3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను –
నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను
నింపువాడవు (2) ||నీతి||
