Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీతో నా జీవితం సంతోషమే నీతో Telugu Christian Song Lyrics

నీతో నా జీవితం సంతోషమే నీతో Lyrics

నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే

భీకర ధ్వనిగలా మార్గమునందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం (2)       ||ఆరాధ్యుడా||

సంతోషమందైనా శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2)       ||ఆరాధ్యుడా||

ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు (2)        ||నీతో నా||

Your favourites

  • No Favourites found!