Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ? Telugu Christian Song Lyrics

నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ? Lyrics


నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? (2)

1. వెండి బంగారము ధన ధాన్యాలను ఒక్కపోగేసిన నీతో సరితూగునా (2)
జీవనదులన్నియూ సర్వసముద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి నీవేగా మంచి దేవుడవు (2)

2. పలు వేధాలలోమత గ్రందాలలో పావనేసుకన్న పరిశుద్ధుడెవరు (2)
పాప పరిహారము సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడవు (2)

3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి (2)
నీకు గాయాలుచేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమియించితివి
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు (2)

Your favourites

  • No Favourites found!