Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు Telugu Christian Song Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా||

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు            ||నా ప్రాణమా||

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను            ||నా ప్రాణమా||

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును            ||నా ప్రాణమా||

Your favourites

  • No Favourites found!