నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో
నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతి||
1.
చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా
సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను ||నీతి||
2.
సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు విడి
తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను ||నీతి||
3.
గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు
పరిహరించెడు దాతనే సేవించుఁడి ||నీతి||
4.
పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని పరము
నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతి||
5.
ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి
వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతి||
6.
ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని త్రిత్వమగునా
యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి Lyrics
Your favourites
- No Favourites found!
