Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక Telugu Christian Song Lyrics

నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక Lyrics

నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు
నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే||

1. పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి
నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే||

2. కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ
ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ
మార్గంబు ||నీవే||

3. లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు
వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే||

4. నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు
ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవే||

Your favourites

  • No Favourites found!