Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నా రక్షణ – నీవే Telugu Christian Song Lyrics

నీవే నా రక్షణ – నీవే Lyrics

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)        ||నీవే నా||

గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2)         ||యేసయ్యా||

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2)         ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!