Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నా స్నేహము – నీవే Telugu Christian Song Lyrics

నీవే నా స్నేహము – నీవే Lyrics


నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము (2)
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత (2)      ||నీవే||

నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2)
నా దేవుని మందిరములో నివసించెదను
నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2)        ||సర్వోన్నతుడా||

నా బలహీన స్థితిలో గతివి నీవైతివే
నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2)
కృంగిన నా హృదయమును లేవనెత్తితివి
అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2)        ||సర్వోన్నతుడా||

Your favourites

  • No Favourites found!