Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే శ్రావ్యసదనము నీదే Telugu Christian Song Lyrics

నీవే శ్రావ్యసదనము నీదే Lyrics

నీవే శ్రావ్యసదనము
నీదే శాంతివదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా  ||నీవే ||

1. విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం (2)
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణహస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా  ||నీవే ||

2. నీ నీతి నీరాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు  (2)
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా  ||నీవే ||

3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా  (2)
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా  ||నీవే ||

Your favourites

  • No Favourites found!