(Verse 1)
నీవెక్కడున్నావని?
నీ గమ్యం ఎటువైపని?
ప్రశ్నించుచున్నాడు దేవుడు
ఇకనైనా బదులిమ్మని…..
ప్రభు లేని బ్రతుకేంటని?
నీ జన్మ విలువ ఏంటని?
గమనించి చూడు తొలగించి
నీ కనులపై పొరలని…….
(Chorus Hook)
కడు స్వల్ప మీ జీవితం…..
తృణప్రాయమే యవ్వనం…..
కనుమూయు కాలం ఒకరోజు ఉంది
మరి కాదేది శాశ్వతం……
ఈ లోకం ఒక మాయని…..
ప్రభు ప్రేమయే స్థిరమని…..
ఇకనైనా నీ మనసు మారి
ప్రభు కొరకు బ్రతుకు కొనసాగని……
(Verse 2)
నేర్చి వ్యసనాలు పేర్చి పాపాల
ముసుగులో నీవు విసిగిపోతావు
కోరి కలహాలు మీరి మోసాలు
చేసి దోషి అవుతావు…..
నిన్ను కన్న నీ తండ్రి చిత్తమును
ఎరుగలేని గతిలో ఉన్నావు
కన్ను మిన్నులే కానకుండా
ఇలా ప్రాకులాడుతుంటావు…….
సరదాల చెలిమికోరి వలయంలో చిక్కుతావు…
ఘనమైన క్రీస్తు ప్రేమే సరిగా నువ్వు పోల్చుకోవు…
అపవాదికి అతి సులభంగా దొరికిపోతావు
అపరాధిగా తుది మహాసభలో నిలబడతావు……
(Chorus Hook)
కడు స్వల్ప మీ జీవితం….
తృణప్రాయమే యవ్వనం….
కనుమూయు కాలం ఒకరోజు ఉంది
మరి కాదేది శాశ్వతం
ఈ లోకం ఒక మాయని….
ప్రభు ప్రేమయే స్థిరమని….
ఇకనైనా నీ మనసు మారి
ప్రభు కొరకు బ్రతుకు కొనసాగని…..
(Verse 1)
నీవెక్కడున్నావని?
నీ గమ్యం ఎటువైపని?
ప్రశ్నించుచున్నాడు దేవుడు
ఇకనైనా బదులిమ్మని…..
(Verse 3)
అందచందములు బందు బలగములు
శాశ్వతం అని మురిసిపోతావు
అండదండలే చూసుకుని నీవు
మెడిసి మిడిసి పడతావు…..
లోక ఆశలతో వ్యర్థ ఊహలతో
జీవితం విలువనే మరిచావు
ఆదరించు ప్రభువుయేసు దరికి
నీవెపుడు చేరుకుంటావు…..
వాట్సాప్ ఫేస్బుక్లతో కాలాన్నే గడిపేస్తావు….
క్షణమైనా క్రీస్తు కొరకు సమయాన్నే కూర్చుకోవు ….
ఇప్పుడైనా అర్పిస్తావా ప్రభుకై నీ హృదయం….
ప్రభు స్నేహం పరలోకానికి అంతిమ మార్గం….
(Chorus Hook)
కడు స్వల్ప మీ జీవితం….
తృణప్రాయమే యవ్వనం….
కనుమూయు కాలం ఒకరోజు ఉంది
మరి కాదేది శాశ్వతం
ఈ లోకం ఒక మాయని….
ప్రభు ప్రేమయే స్థిరమని….
ఇకనైనా నీ మనసు మారి
ప్రభు కొరకు బ్రతుకు కొనసాగని…..
(Verse 1)
నీవెక్కడున్నావని?
నీ గమ్యం ఎటువైపని?
ప్రశ్నించుచున్నాడు దేవుడు
ఇకనైనా ఇకనైనా బదులిమ్మని…..
