నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు
యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా?
1. మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా
మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం
2. మారు మనస్సు పొందెదమిప్పుడే - జీవితమోసములనుండి
పరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం
3. అపవాదికి చోటివ్వక - బహుజాగ్రతతో నుండెదం
మనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము
4. నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదము
నీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో
5. పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమా
ఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును
6. ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవుని
నీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు
7. ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములని
పూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి Lyrics
Your favourites
- No Favourites found!
