Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు చేసిన ఉపకారములకు Telugu Christian Song Lyrics

నీవు చేసిన ఉపకారములకు Lyrics

నీవు చేసిన ఉపకారములకు  
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) 

వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2)             ||ఏడాది||

మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2)   ||ఏడాది||

విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2)        ||ఏడాది||

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2)          ||ఏడాది||

Your favourites

  • No Favourites found!