పల్లవి:
నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును (2x)
ఏడాది దూడలనా - వేలాది పొట్టేళ్ళనా (2x)
...నీవు చేసిన...
1.
వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా (2x)
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా (2x)
...ఏడాది...
2.
మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో (2X)
కరుణ చూపి నీ దివ్య మార్గాన - నడిపించితివి యేసయ్యా (2X)
...ఏడాది...
3.
విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునూ (2X)
రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించేదను (2X)
...ఏడాది...
4.
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున - నేనేమి చెల్లింతునూ (2X)
కపట మనస్సు లేనట్టి హృదయాన్ని - అర్పింతునోయేసయ్యా (2X)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీవు చేసిన ఉపకారములకు నేనేమి Lyrics
Your favourites
- No Favourites found!
