Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము Telugu Christian Song Lyrics

నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము Lyrics

నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును
1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు
ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును
చింతింతువు ఒకనాడు
2. దేవుని రాజ్యము నీతి - వెదకుము నీవు మొదట
బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె
నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున
అంగీకరించుము నేడె
3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం
దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును
శాంతి ఆనందం పొందెదరు
4. కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు
సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్
ఆ రాజ్యములో నుందురు


Your favourites

  • No Favourites found!