Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప Telugu Christian Song Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని||
శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||
శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||

Your favourites

  • No Favourites found!