నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ
గావవే ||నీవు||
1. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి
సర్వ భూపతి ||నీవు||
2. శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు
నాయకా మోక్ష దాయకా ||నీవు||
3. జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ
జీవనా ||నీవు||
4. జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ
భాగిని ||నీవు||
5. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా
కృపను జూపవా ||నీవు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీవు నా దేవుండవై యు న్నావు Lyrics
Your favourites
- No Favourites found!
